ప్రారంభిస్తున్న డాక్టర్ గోపాల్
నారాయణ అత్యవసర విభాగంలో 'ట్రయేజ్' ఏర్పాటు
ప్రజాశక్తి-నెల్లూరు:నగరంలోని నారాయణ హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగంలో నూతనంగా ట్రయేజ్న సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. బుధవారం నారాయణ వైద్యశాలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ వైద్యశాల అత్యవసర విభాగాధిపతి డాక్టర్ గోపాల్ మాట్లాడుతూ ప్రమాదకర పరిస్థితిలో పేషంట్స్ హాస్పిటల్కు వచ్చినపుడు వ్యాధి తీవ్రతను బట్టి ప్రాధాన్యత క్రమంలో చికిత్స అందించేందుకు ఈ ట్రయేజ్ను ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రాణాంతకమైన వ్యాధులను త్వరితముగా గుర్తించి, చికిత్స అందించడం ద్వారా వ్యాధి నయం అయ్యేందుకు, రోగి త్వరగా కోలుకునేందుకు అవకాశాలు ఉంటాయని తెలిపారు. అనంతరం నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి వైద్యశాలకు అత్యవసర విభాగం ఎంతో కీలకమన్నారు. ఈ విభాగంలో ఉన్న రోగులకు ప్రమాదకరమైనటువంటి గుండె వ్యాధులు, ప్రాణాంతమైన వ్యాధులు (మాస్ క్యాజువాలిటీ) త్వరితముగా గుర్తించి, చికిత్స అందించేందుకు ఈ ట్రయేజ్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. తమ వైద్యశాలలోని అత్యవసర విభాగంలో ట్రయేజ్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన డాక్టర్ గోపాల్ , వారి బందాన్ని యాజమాన్యం తరపున ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. శ్రీనివాసులు రెడ్డి, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్, హారీష్, డిప్యూటి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ కాంత్, అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుప్రజ, డాక్టర్ కె. మంజుప్రభ, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులు, హాస్పిటల్ ఏ.జి. ఎం శేఖర్రెడ్డి , నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










