Nov 05,2023 00:10

నారాయణ అధ్యాపకునికి డాక్టరేట్‌

నారాయణ అధ్యాపకునికి డాక్టరేట్‌
ప్రజాశక్తి - గూడూరు టౌన్‌ : గూడూరు నారాయణ ఇంజనీరింగ్‌ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న పి కె వెంకటేశ్వర్‌లాల్‌ గుంటూరు విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయం కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌ మెంట్‌ నుండీ డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ పీహెచ్‌డి పట్టా పొందారని ఆ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వి రవిప్రసాద్‌ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ పి కె వెంకటేశ్వర్‌ లాల్‌ మాట్లాడుతూ తన థీసిస్‌ శీర్షిక 'రియల్‌ టైమ్‌ సెక్యూరిటీ అప్లికేషన్లలో ఫేస్‌ రికగ్నిషన్‌ కోసం న్యూరల్‌ నెట్వర్క్‌ క్లాసిఫైయర్తో మల్టీ-హెడ్‌ అటెన్షన్‌' అని తెలిపారు. తాను పరిశోధన చేసి థీసిస్‌ సమర్పించినందుకు పీహెచ్‌ డీ పట్టాని ప్రదానం చేశారని తెలిపారు. ఈ పరిశోధనలో భాగంగా ఎయిర్‌పోర్టు కంట్రోల్‌ లో, బ్యాంకింగ్‌ లో, క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ లో, మొబైల్‌ పేమెంట్స్‌ లాలో ఉపయోగిస్తారని తెలిపారు. తనకు అన్ని విధాలుగా సహాయ సహ కారాలు అందించిన కళాశాల యాజమాన్యానికి, అధ్యాపకులకు, కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా గైడ్‌ డాక్టర్‌ యు శ్రీలక్ష్మి కత్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా , ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వి రవి ప్రసాద్‌ , వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ విశ్వక్సేన రెడ్డి మాట్లాడుతూ నారాయణ ఇంజనీరింగ్‌ కళాశాల, గూడూరు అధ్యాపకులకు పరిశోధన చేయటంలో సహాయ సహకారాలు అందించటమే కాకుండా సాధ్యమైనంత వరకు అన్ని వనరులు అందిస్తామని తెలిపారు. అనంతరం డాక్టర్‌ పి కె వెంకటేశ్వర్‌ లాల్‌ కి అభి నందనలు తెలిపారు.