విరాళం అందజేస్తున్న రాజేష్
ప్రజాశక్తి - చీరాల : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను చీరాల నియోజక వర్గం టిడిపి యువ చేనేత చాట్రాసి రాజేష్ శుక్రవారం కనిగిరిలో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయన లోకేష్‌తో కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడారు. రాష్ట్రంలో టిడిపికి అధికారం కల్పించేందుకు ప్రజల ందరూ ఎదురు చూస్తున్నారని తెలిపారు. టిడిపి అభివద్ధికి నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగరవేసేందుకు అహర్నిశలు కషి చేస్తూ పార్టీ బలోపేతానికి నాయ కులు కార్యకర్తలను సమన్వయం చేస్తూ పార్టీ కార్యక్రమాలలో భాగ స్వామ్యం అవుతానని తాను లోకేష్ దష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. అనంతరం రాజేష్ టిడిపి కార్యక్రమాలకు రూ.5 లక్షల విరాళాన్ని చెక్కును నారా లోకేష్‌కు అందజేశారు










