
నారా లోకేష్‌కు భారీ స్వాగతం
- బనగానపల్లి నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్/బనగానపల్లి
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన 104వ రోజు యువగళం పాదయాత్రకు బనగానపల్లి నియోజకవర్గంలో భారీగా స్వాగతం పలికారు. నంద్యాల నియోజకవర్గం రాయపాడు నుండి బనగానపల్లి మండలంలోని టంగుటూరు, అప్పలాపురం, కైప వరకు శుక్రవారం పాదయాత్ర సాగింది. మండలంలోని టంగుటూరు పెద్దమ్మ దేవస్థానం వద్ద లోకేష్‌కు మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి, ఆయన కుమారుడు బిసి మనోహర్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. లోకేష్ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి, నక్క ఆనందబాబు, కాల్వ శ్రీనివాసులు, డోన్ నియోజకవర్గ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి, మాజీ సర్పంచి బిసి రాజారెడ్డి కలిసి నడిచారు. బనగానపల్లి నియోజకవర్గం టంగుటూరులో లోకేష్‌ను చూసేందుకు జనం పెద్దఎత్తున తరలిరావడంతో రోడ్లన్నీ కిక్కిరిసి పోయాయి. పాదయాత్రకు బయలుదేరేముందు రాయపాడు క్యాంప్ సైట్ వద్ద ప్రముఖులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. దారిపొడవునా వివిధ రంగాల నాయకులు, కార్మికులు, ప్రజలు తమ సమస్యలను యువనేతకు చెప్పుకున్నారు. విద్యుత్ కోతలతో ఇబ్బంది పడుతున్నామని, నిత్యావసర సరుకుల ధరలు, పెరిగిన విద్యుత్ బిల్లుల కారణంగా బ్రతకడం కష్టంగా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో పన్నుల భారాన్ని, అసమర్ధ ప్రభుత్వ విధానాల గురించి ప్రజలకు వివరించారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం మీ అందరి కష్టాలు తీరుస్తుందని భరోసా ఇచ్చి యువనేత ముందుకు సాగారు. పాదయాత్ర దారిలో రైతులు, వడ్డెరలు, యాదవులు యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. 104వ రోజు యువనేత లోకేష్ 11 కిలో మీటర్ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1330.1 కిలోమీటర్లు పూర్తయింది. శనివారం బనగానపల్లె పట్టణంలో యువగళం పాదయాత్ర, బహిరంగసభ నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ నాయకులు బిసి రామనాథ రెడ్డి, మాజీ ఎంపిపి అంబాల రామకృష్ణారెడ్డి, టిడిపి ఎస్టి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటరమణ నాయక్, వాణిజ్య విభాగం నంద్యాల పార్లమెంటు అధ్యక్షులు టంగుటూరి శీనయ్య, మండల అధ్యక్షులు పివి కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఖాసింబాబు, పట్టణ ఉపసర్పంచి బురానుద్దీన్, పాతపాడు, మిట్టపల్లి సర్పంచులు బెడదల మహేశ్వరరెడ్డి, తులసి రెడ్డి, నాయకులు వెంకటాపురం అమర్నాథరెడ్డి, పాతపాడు సంకేశ్వర రెడ్డి, రాయలసీమ సలాం, టిప్ టాప్ కలాం, లాయర్ నాగేంద్ర రెడ్డి, కొణిదెల పుల్లారెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, పెద్దరాజుపాలెం భూషన్న, అప్పలాపురం రామాంజనేయరెడ్డి, టంగుటూరు లక్ష్మీ కాంత్ రెడ్డి, పుల్లారెడ్డి, శివ పుల్లారెడ్డి, కైప రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.











