సుండుపల్లి : మండలంలోని ముడుముపాడు గ్రామపంచాయతీలో పింఛ జలాశయ మట్టికట్ట తెగిపోవడంతో జరుగుతున్న నిర్మాణ పనులను ఆదివారం రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యతతో కూడిన పనులు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పింఛా ప్రాజెక్ట్ కింద సుమారు 3వేల ఎకరాలు సాగునీరు అందేదని, ప్రాజెక్టు కట్ట తెగిపోవడం రైతులకు తీరని నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో పనులు పూర్తి చేసి రైతులకు రైతులకు సాగునీరు అందించాలన్నారు. తాగునీటికి సైతం ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురు కావడం బాధాకరమన్నారు.సెప్టెంబర్ నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అన్నమయ్య, పింఛా జలాశయాలకు భూమి పూజ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి ఇస్మాయిల్, సర్పంచ్ ఆకుల శ్రీనివాసులు, కో-ఆప్షన్ కలీంబాషా, వైసిపి నాయకులు శ్రీనివాసులురెడ్డి, మైనార్టీ నాయకులు రహీంబాషా, మహేశ్వర్‌రెడ్డి, జయరాంనాయుడు, సచివాలయ కన్వీనర్ మజాహర్ పాల్గొన్నారు.










