
ప్రజాశక్తి - చీరాల
పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులు చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అధికారులను ఆదేశించారు. స్థానిక ఎన్ఆర్ అండ్ పిఎం ఉన్నత పాఠశాల ఆవరణలోని పార్క్, చిల్డ్రన్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులకు తగు సలహాలు సూచనలు ఇచ్చారు. మున్సిపల్ పిల్లల పార్కులో ఆట వస్తువులు పరిశీలించారు. అక్కడ వసతులపై చిన్నారుల తల్లి దండ్రులతో మాట్లాడారు. ఆయన వెంట చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు, మునిసిపల్ కమిషనర్ రామచంద్రరెడ్డి, డిఇ ఐసయ్య, ఎఇలు పాల్గొన్నారు.