పెదకూరపాడు: నాణ్యతలేమితో రోడ్లు అధ్వానంగా మారాయని పెదకూరపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. ఆది వారం పెదకూరపాడు నుండి అత్తలూరు వెళ్లే ప్రధాన రహదారిని ఆయన పరిశీలించారు. నిర్మించిన తొమ్మిది నెలలకే రోడ్డు గుంతలు ఏర్పడటం, రోడ్డు నాణ్యతను తెలియజేస్తోందన్నారు. అవినీతి, అక్రమాలలో వైసిపి ప్రభు త్వం కూరుకుపోయిందన్నారు. ఈ రోడ్డును చూస్తే వారి పని తీరు తెలిసిపోతోందని విమర్శించారు.










