Feb 24,2023 23:44

అమెరికన్‌ కార్నర్‌లో ఎయు ప్రతినిధులతో ఎఫ్‌డిఎ బృందం

ఎఫ్‌డిఎ డ్రగ్‌ క్వాలిటీ డివిజన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కార్మిలో రోసా
ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ
: భారతీయ ఔషధ ఉత్పత్తి పరిశ్రమలు నాణ్యతా వ్యవస్థలను నిరంతరం మెరుగుపరచుకోవాలని అమెరికాలోని ఎఫ్‌డిఎ డ్రగ్‌ క్వాలిటీ డివిజన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కార్మిలో రోసా అన్నారు. శుక్రవారం ఎయు వైవిఎస్‌ మూర్తి ఆడిటోరియంలో ఎయు, యుఎస్‌ ఎఫ్‌డిఎ సంయుక్త ఆధ్వర్యాన నిర్వహించిన 'కరెంట్‌ గుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్రాక్టీసెస్‌' వర్క్‌షాప్‌ రెండవ రోజున 'బలమైన నాణ్యత వ్యవస్థను నిర్మించడం' అంశంపై మాట్లాడుతూ ఫార్మ పరిశ్రమలు పారదర్శకంగా పనిచేస్తూ, నాణ్యమైన ఔషధాల తయారీకి నిరంతరం కృషి చేయాలని సూచించారు. నాణ్యత పరీక్షలో విఫలమైన ఔషధాలు రోగిపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. సర్వసాధారణంగా పరిశ్రమల్లో జరిగే లోపాలు వాటిని గుర్తించే విధానాలను వివరించారు. ఎఫ్‌డిఎ వద్ద ఫొటోలు, ఆధారాలతో విస్తతమైన సమాచారం ఉంటుందనే వాస్తవాన్ని ఫార్మా పరిశ్రమలు విస్మరించరాదన్నారు. నమూనాల సేకరణ, రివ్యూ, నాణ్యత ప్రమాణాల వ్యవస్థను నిరంరతం పర్యవేక్షించడంలో అనుసరించాాల్సిన విధానాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. యుఎస్‌ కంజ్యూమర్‌ సేఫ్టీ ఆఫీసర్‌ సలీమ్‌ అక్తర్‌ రికార్డులను రూపొందించడం, భద్రపరచడం వంటి అంశాలను వివరించారు. సీనియర్‌ పాలసీ అడ్వైజర్‌ బ్రూక్‌ హిగ్గిన్స్‌ ప్రోసెస్‌ ధ్రువీకరణ. అసెప్టిక్‌ కార్యకలాపాలను వివరించారు. ఒఆర్‌ఎ నేషనల్‌ ఎక్ప్‌పర్ట్‌ జోన్‌ మెలెంజ్‌, అమెరికాకు చెందిన వయాట్రిస్‌ గ్లోబల్‌ క్వాలిటీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పురాణం, ఎయు ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య వై.రాజేంద్రప్రసాద్‌, అంతర్జాతీయవ విద్యార్థి వ్యవహారాల డీన్‌ ఆచార్య ఇఎన్‌ ధనుంజయరావు పాల్గొన్నారు.
అమెరికన్‌ కార్నర్‌ను ఎఫ్‌డిఎ నిపుణుల బృందం సందర్శన
ఎయులోని అమెరికన్‌ కార్నర్‌ను డాక్టర్‌ కార్మిలో రోసా నేతృత్వంలోని ప్రతినిధుల బందం శుక్రవారం సందర్శించారు.అమెరికన్‌ కాన్సులేట్‌ సహకారంతో నిర్వహించిన కార్యక్రమాలను కేంద్రం సమన్వయకర్త ఆచార్య జేమ్స్‌ స్టీఫెన్‌ తెలిపారు. కార్యక్రమంలో ఎయు విసి ఆచార్య ప్రసాదరెడ్డి, రెక్టార్‌ ఆచార్య కె. సమత, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ ఆచార్య ఎన్‌. కిషోర్‌బాబు, పూర్వ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.