పార్వతీపురంటౌన్: నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. శనివారం నాడు పట్టణంలో 27వ వార్డు, రాజుగారి కోట ప్రాంతలో ఉన్న ఎజెఆర్ కాలనీ వీధిలో కొత్తగా నిర్మించబోయే సిసి కాలువలు, రోడ్డు, పైపు లైన్ పనులకు ఆ వార్డు కౌన్సిల్ సభ్యులు ఇండుపూరు గున్నేష్‌తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి నిర్మాణం పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కాలనీ గత 40 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నొచుకోక పోవడతో గడపగడపకు మన ప్రభుత్వం స్థానిక ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నేడు ఈ అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందని, మీకు ఎవరికీ ఏ ఇబ్బందీ లేకుండా అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైసిపి పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, కౌన్సిలర్ మజ్జి శేఖర్ (చంటి), బాలమురళీకృష్ణ, మండలం నాయకులు, స్థానిక పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.










