Jul 29,2023 22:13

అభివృద్ధి పనులను పరిశీలన చేస్తున్న కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌

      హిందూపురం : పురపాలక సంఘ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ది పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ అనుకున్న గడువులోగా పనులను పూర్తి చేయాలని గుత్తేదారులకు మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌ సూచించారు. శనివారం తెల్లవారు జామున పారిశుధ్య కార్మికుల హాజరు పరిశీలన చేసి వారికి తగు సూచనలు చేశారు. అనంతరం 32, 34వ వార్డుల్లో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలన చేశారు. ఈ సందర్బంగా కమిషనర్‌ మాట్లాడుతూ పురపాలక సంఘం వ్యాప్తంగా మురికివాడల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇందులో భాగంగా రోజుమార్చి రోజు గ్యాగ్‌ వర్క్‌ ద్వారా మురుగు కాలువలను శుభ్రం చేయడం, దోమల నివారణ కోసం ఫాగింగ్‌, మురుగు కాలువల్లో దోమల నియంత్రణ మందును పిచికారీ చేయిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎఈ నాగేంద్ర, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.