విత్తనాలను పరిశీలిస్తున్న మండల వ్యవసాయాధికారి
ప్రజాశక్తి-కొల్లూరు: వరి రైతులు నాణ్యమైన విత్తనాలనే సాగు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఎన్ వెంకటేశ్వరరావు చెప్పారు. కొల్లూరులో రైతులకు అందించే వరి విత్తనాల షాపులను శుక్రవారం శాంపిల్స్ పరిశీలించారు. విత్తనాలను ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. పరీక్షల అనంతరం మొలక శాతం తేడా ఉన్నట్లు తేలితే ప్రభుత్వ నిబంధన ప్రకారం విత్తనాల కంపెనీలపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు.










