Nov 06,2023 20:58

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : జిల్లాలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష రెఫరెల్‌ కేసులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్‌ గిరీష పి.ఎస్‌ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం, వై. ఏపి నీడ్స్‌ జగన్‌ అంశాలపై ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. రాయచోటి కలెక్టరేట్లోని మినీ విసి హాల్‌ నుంచి కలెక్టరు గిరీష పి. ఎస్‌, డిఆర్‌ఓ సత్యనారాయణ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద రెఫరెల్స్‌ పై ప్రత్యేక దష్టి పెట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు నిర్వహించిన జగనన్న సురక్ష ఆరోగ్య కేంద్రాలను బాగా నిర్వహించారని ఇంకను సజావుగా చేపట్టాలని సూచించారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో జిజిహెచ్‌, ఎంపానల్‌ అయిన ఆసుపత్రులకు రెఫరెల్స్‌ చేసిన కేసులను దగ్గరుండి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించి, మందులను ఉచితంగా అందించడం, ప్రభుత్వ ఆరోగ్య ఆసరా అందించడం చేయాలన్నారు. రెఫరెల్స్‌ కేసులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని, ఆసుపత్రులకు వెళ్లిన వారికి నాణ్యత కలిగిన చికిత్స అందిస్తున్నారా లేదా అనేది పరిశీలించాలన్నారు. ఎలాంటి రాజీ లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించడంపై ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు. రెఫరెల్స్‌ కేసులపై డిఎంహెచ్‌ఒ, డిసిహెచ్‌ఎస్‌, జిల్లా ఆరోగ్య శ్రీ కో-ఆర్డినేటర్‌, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌, ప్రభుత్వ మెడకల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ లు సమన్వయంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కె.కొండయ్య డిసిహెచ్‌ఎస్‌ డేవిడ్‌ సుకుమార్‌, వైద్యాధికారులు పాల్గొన్నారు.