ప్రజాశక్తి- గాజువాక : ప్రతి ఒక్కరికీి నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలన్నదే సిఎం జగన్ లక్ష్యమనిరాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని అన్నారు. శుక్రవారం 64వ వార్డు, గంగవరంలో రూ.1.05కోట్ల ఎన్‌యుహెచ్‌ఎం నిధులతో నూతనంగా నిర్మించిన వైఎస్‌ఆర్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ, పేదల ఇంటివద్దకే మెరుగైన వైద్యం అందించాలని ఫ్యామిలీ ఫిజీషియన్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలో 42 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటును సంకల్పించి, ఇప్పటివరకు 38 నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభించామన్నారు. నిర్మాణ దశలో ఉన్న నాలుగింటని త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఈసందర్భంగా స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ, గంగవరం పోర్టు కోసం భూములిచ్చి, పోర్టులోనే కూలీలుగా పనిచేస్తున్న నిర్వాసితులకు వేతనాలు పెంచాలని, అలాగే కాలుష్యాన్ని నియంత్రించే చర్యలు చేపట్టాలని కోరారు.దీనిపై మంత్రి స్పందించి, సిఎం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేద్దామన్నారు. కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్ జగదీశ్వరరావు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న మంత్రి రజని










