ప్రజాశక్తి - కొత్తవలస : విద్యార్థులకు నాణ్యమైన సరుకులను అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం. హర్ష డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ బృందం పర్యటిచింది. ఈ సందర్భంగా హర్ష మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రవేశ పెట్టిన జగనన్న గోరుముద్ద అమలు హడావుడి, ఫోటోలకు తప్పించి విద్యార్థులకు ఉపయోగపడలేదన్నారు. విద్యార్థులకిచ్చే రాగి మాల్ట్ (అంబలి), బెల్లం, బియ్యం వంటి ఆహార సరుకులు నాసిరకంగా ఉన్నాయని దీనివల్ల విద్యార్థులు తినడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్ధులకు పౌష్టికాహారం అందించే విధంగా నాణ్యమైన ఆహార సరుకులు పంపిణీ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని తహశీల్దార్‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు చైతన్య, సాయి వినరు, అరుణ్, గణేష్, ఎర్నాయుడు తదితరులు పాల్గొన్నారు.










