
వేంపల్లె ; నాన్న ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ట్విట్టర్ వేధికగా పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి 14వ వర్థంతిని పురస్కరించుకుని శనివారం కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఘననివాళులర్పించారు. తాడేపల్లి నుండి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్ పోర్టుకు చేరుకున్న సిఎం సతీమణి భారతితో కలిసి హెలికాప్టర్‌లో ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రానికి విచ్చేశారు. అనంతరం తల్లి వైఎస్.విజయమ్మ, చిన్నాన్న వైఎస్.సుధీకర్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్‌ఆర్ ఘాట్ వద్దకు చేరు కున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం వైఎస్ రాజశేఖ రరెడ్డి సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి ముఖ్యమంత్రి జగన్ ఘనంగా నివాళులర్పించారు. ఘాట్ సమీపంలో ఉన్న వైఎస ్‌ఆర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనం తరం ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న గెస్ట్‌హౌస్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన తిరిగి హెలి కాప్టర్‌లో కడపకు చేరుకుని ప్రత్యేక విమానంలో తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి.అంజద్‌బాషా, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, శాసనమండలి డిప్యూటి చైర్మన్ జఖియాఖనం, ఎమ్మె ల్సీలు గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రఘురామిరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, మేడా మల్లిఖా ర్జునరెడ్డి, టి.జె..సుధాకర్ బాబు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, డాక్టర్ సుధ, జడ్‌పి చైర్మన్ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, టిటిడి బోర్డ్ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహా దారుదారు ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, రాష్ట్ర ఉద్యాన సలహా దారు, జిల్లా వ్యవసాయ సలహా బోర్డు చైర్మన్ పి. శివప్రసాద్‌రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఎపిఎస్‌ఆర్‌టిసి చైర్మన్ మల్లిఖార్జునరెడ్డి, ముఖ్య కార్యదర్శి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్, సహాయ వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వరరెడ్డి, కలెక్టర్ వి.విజరురామరాజు, ఎస్‌పి అన్బురాజన్, జెసి గణేష్ కుమార్, ఒఎస్‌డి అనిల్ కుమార్‌రెడ్డి, పులివెందుల ఆర్‌డిఒ వెంకటేశం, అదనపు ఎస్పీ తుషార్ డూడీ, అన్నమయ్య జిల్లా ఎ స్పీ గంగాధర్‌రావు, అసిస్టెంట్ కలెక్టర్ భరద్వాజ్ పాల్గొన్నారు.