ఆదర్శ నాయకత్వం
కనపడటంలేదు
నోటులేనిదే
ఓటువేయరు కదా!
తీపిమాత్రని చప్పరించా...
లోనంతా చేదే!
కృతక స్నేహంలా...
బాధపెట్టింది!
కాలం
ఒట్టి రాలుగాయి!
ఎన్ని కాలాలు
వేచినా, పట్టలేము!!
ఆ రూపం
చూడలేనిది!
ఆకాశమంతని కాదు...
అగ్నిశిఖ అని మాత్రమే!
అదిగో..
మాటల తుపాను!
గుండె సంద్రంలో..
ఒకటే అలజడి!
సముద్రం
ఎదురొచ్చింది!
అలల పెదవులపై
తెల్లని నవ్వులతో!
అతనికి
అత్యహంకారం!
ఆమె సహనంలో
భూమాత కనుకే !
ఎన్ని గాయాలో గుండెకు!
పలుకులను
నింపుకుంటే అంతే!
నియంతగా
ఉండడం తప్ప!
నియంతృత్వం
ఎవరికీ నచ్చదు!
వంటలు, వ్రతాలు
ఆమెకట!!
పదవీ, అధికార అహం,
అతనికేనట!
ఆ కలం
కత్తి కాదు!
కవి కరుణాంతరంగం
మంచు ఖడ్గం!
ద్వేషానికి
బదులిచ్చాడాయన!
అక్షరాలతో
ప్రేమను నింపుతూ!
సముద్రం చూస్తే
సంతోషమయింది !!
కన్నీటి నదులు
మోసే కళ్లకు!!!
సుభాషిణి ప్రత్తిపాటి
80993 05303