పచ్చని పొలానికి
చీడ పురుగు
వసంతంలో
శిశిరం కాబోలు
ఎన్ని పూలను
మాలలుగా అల్లను?
దారం సాలీడుపోగు అయినప్పుడు
పుడమి
పులకరించింది
విత్తనం పురుడు పోసుకోవడంతో
అద్దం పరవశించింది
ఆమె మోమును
తనలో దాచుకోవడంతో
కవి కలం
కదం తొక్కుతోంది
మరో శ్రీ శ్రీ
పుట్టుక కోసమేమో!
కయ్యూరు బాలసుబ్రమణ్యం
94417 91239