
ప్రజాశక్తి -నక్కపల్లి:మండలంలో రేబాక పంచా యతీలో 3వ వార్డుకు సంబంధించి బుధవారం ఒక నామినేషన్ దాఖలు అయినట్లు ఆర్వో డి సత్యనారాయణ, ఏవో సీతారామరాజు వెల్లడిం చారు. రేబాక పంచాయతీ సర్పంచ్ సాదిరెడ్డి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ నానాజీ, ఉప సర్పంచ్ శ్రీనివాసరావు, వి.కాసుబాబు చేతుల మీదుగా నామినేషన్ పత్రాన్ని ఆర్‌ఓకు అందజేశారు. మండలంలోని చిన్నదొడ్డిగల్లులో 1వ వార్డు, రేబాక పంచాయతీలో 3వ వార్డు ఖాళీ ఏర్పడటంతో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిరణ్ పాల్గొన్నారు .
గొలుగొండ:మండలంలో వార్డు మెంబర్ల ఉప ఎన్నిక నిమిత్తం బుధవారం ఒక నామినేషన్ దాఖలైందని ఎంపిడిఒ డేవిడ్‌రాజు తెలిపారు. మండలంలో సిహెచ్.నాగాపురం పంచాయతీలో ఎస్సీ రిజర్వేషన్‌కు కేటాయించిన వార్డు మెంబర్ స్థానానికి జుర్రా కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. గాదంపాలెం పంచాయతీలో ఒక వార్డు మెంబర్‌కు ఎన్నిక జరగాల్సి ఉండగా ఇంకా నామినేషన్లు దాఖలు కాలేదని ఎంపిడిఒ తెలిపారు.