Sep 19,2023 23:40

ప్రజాశక్తి - వేటపాలెం
మండలంలోని వివిధ ప్రాంతాలలో నెలకొల్పిన వినాయకుని మందిరాలకు పీఎస్ఆర్ ఫిషరీస్ అండ్ కో ఆధ్వర్యంలో 25కేజీల రైస్ బ్యాగులను దాదాపు నాలుగు క్వింటాళ్ల బియ్యాన్ని మంగళవారం పంపిణీ చేశారు. ఈ బియ్యం బ్యాగులను నిమజ్జనం అనంతరం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదానికి వినియోగించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోప్రైటర్ పి శ్రీనివాసులు, నవషా, సురేష్, రెడ్డి, చంటి పాల్గొన్నారు.