
మలయాళ హీరో 'టోవినో థామస్' ప్రస్తుతం 'ఎఆర్‌ఎం'( అజయంతే రాండమ్ మోషనమ్) అనే సినిమా చేస్తున్నారు. ఈ పీరియాడిక్ డ్రామాని జతిన్ లాల్ డైరెక్ట్ చేస్తున్నారు. భారీ బడ్జట్‌తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. తెలుగులో నాని, కన్నడలో రక్షిత్ శెట్టి, హిందీలో హృతిక్ రోషన్, మలయాళంలో పృథ్వీరాజ్ ఈ టీజర్‌ని లాంచ్ చేసారు. ప్రతి ఫ్రేమ్‌లో గ్రాండ్‌గా ఉన్న ఈ టీజర్ అన్ని భాషల్లో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని సొంతం చేసుకుంది. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించని ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు..