కొమరాడ: పుర్ణపాడు - లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ సాధన కమిటీ ఆధ్వర్యంలో బిక్షాటన చేస్తూ నాలుగువ రోజు రిలే నిరాహార ఆదివారం చేపట్టారు. పూర్ణపాడు - లాబేసు వంతెన పెండింగ్ పనులను పూర్తి చేయాలని సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు అరకు పార్లమెంటు బిసి సెల్ అధికార ప్రతినిధి ద్వారపూడి సత్యనారాయణ, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్, సహాయ కార్యదర్శి పువ్వల తిరుపతిరావు మద్దతు తెలిపారు. అనంతరం వీరు మాట్లాడుతూ ఇప్పటికైనా మన పాలకులు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే కాంట్రాక్టర్‌ను రప్పించి వంతెన పనులు పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారమయ్యేంత వరకూ ఈనెల 26 వరకు జరుగుతున్న రిలే నిరార దీక్షలను, 28న తహశీల్దార్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సాధన కమిటీ సభ్యులు వాకాడ ఇందిర, కొల్లి సాంబమూర్తి, బత్తిలి శ్రీనివాసరావు, పాలక నూకరాజు, హెచ్.రామారావు, శివున్నాయుడు, వెంకటేశు, అప్పారావు, పోలినాయుడు, గౌరీ, గణపతి, సింహాచలం, మాణిక్యం, రాజేశ్వరి, లక్ష్మమ్మ, పార్వతి, అప్పారావు పాల్గొన్నారు.










