Mar 23,2023 23:58

గిరిజన గ్రామంలో పర్యటిస్తున్న కిడారి శ్రవణ్‌కుమార్‌

ప్రజాశక్తి-పెదబయలు:మండలంలో అరడకోట పంచాయతీ నిమ్మగుంట గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల కార్యదర్శి నాగేశ్వర్‌రావు అధ్వర్యంలో.ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వహించారు. టిడిపి అరకు నియోజక వర్గం ఇంఛార్జి, మాజీ మంత్రి కిదారి శ్రవణ్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా.హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రవణ్‌కుమార్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వంతో పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఇదేం ఖర్మ కార్యక్రమం దృష్టికి గిరిజనులు పలు సమస్యలు లేవనేత్తుతున్నారన్నారు. మంచినీటి, డ్రైనేజీ, సిసి రోడ్స్‌ లేని గ్రామాలు .అనేకం ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత ఉందన్నారు. వైసీపీ గెలిచి నాలుగేళ్లు అవుతుందని అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అన్న చందాన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో .మాజి సర్పంచ్‌ తైసాబు త్రినాథ,్‌ రాష్ట్ర ఎస్టీ సెల్‌ ఆర్గనైజ్‌ కార్యదర్శి సాగర సుబ్బారావు, దారెల సర్పంచ్‌ పాంగి పాండు రంగస్వామి, అరకు పార్లమెంట్‌ రైతు సంఘం అధ్యక్షుడు భూషన్‌రావు పాల్గొన్నారు.