Oct 15,2023 21:04

షేక్‌ హుస్సేన్‌ సత్యాగ్నికి కేతు విశ్వనాథరెడ్డి స్మారక జీవితపురస్కారం అందజేస్తున్న ఉపముఖ్యమంత్రి

 కడప అర్బన్‌ : తనకు రాజకీయ గురువు షేక్‌. హు సేన్‌ సత్యాగ్ని అని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి అంజాద్‌ బాషా అన్నారు. తనకు సాహిత్యంతో ఏమాత్రం సంబంధం లేకపోయినా తన గురువుకు జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వాలనే తపనతో సభలో పాల్గొంటున్నానని అన్నారు. ఆదివారం స్థానిక ఐఎంఎ హాలులో జరిగిన కేతు విశ్వనాథ రెడ్డి స్మారక జీవన సాఫల్య పురస్కార సభలో ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కవిత విద్యా సాహిత్య సాంస్కతిక సేవా సంస్థ ఆధ్వ ర్యంలో ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని షేక్‌ హుసేన్‌ సత్యాగ్నికి అందజేశారు. యోగివేమన యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఈశ్వర్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ కేతు విశ్వనాథ రెడ్డితో తాను ఒక సాహిత్య సభలో వేదిక పంచుకున్నానని, ఆ సభలోనే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో తనకు తెలిసిందన్నారు. షేక్‌ హుసేన్‌ సత్యాగ్ని తనకు రాజకీయాల్లో తొలి నుంచి మంచి ప్రోత్సాహం ఇచ్చారని వై.ఎస్‌. రాజ శేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనను అనేక సార్లు ఆయన వద్దకు తీసుకెళ్లి ఒక గుర్తింపు తీసుకొచ్చారని అన్నారు. కేతు విశ్వనాథ రెడ్డి జీవితం- సాహిత్యం అనే అంశంపై కథా రచయిత పాలగిరి విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ సాధా రణంగా రచయితలు వ్యక్తులుగా కన్నా వారి రచనలు గొప్పగా ఉంటాయని, ఎక్కడో నూటికొకరు మాత్రమే రచనల కన్నా వ్యక్తిగా గొప్పవారు ఉంటారని చెబుతూ, కేతు విశ్వనాథ రెడ్డి రచ యితగా ఎంత గొప్పవారో వ్యక్తిగా అంతకన్నా గొప్ప వారని అన్నారు. కథా రచయిత వేంపల్లె షరీఫ్‌ మాట్లాడుతూ సాహిత్యంలో మైనార్టీ, దళిత, స్త్రీ వాదాలు అనేవి ఏర్పడక ముందే ముస్లిం జీవితాల గురించి రాసిన రచయిత సత్యాగ్ని అని అన్నారు. పురస్కార గ్రహీత తన స్పందనను తెలియజేస్తూ తనకు గురుతుల్యులైన కేతు విశ్వనాథరెడ్డి పేరు మీద ఇస్తున్న జీవిత సాఫల్య పురస్కారం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. తనకు శరీరం సహ కరించని స్థితిలో ఉన్న సమయంలో కవితా విద్యా సాహిత్య సాంస్కతిక సేవా సంస్థ అధ్యక్షులు పిచ్చయ్య చౌదరి ఈ పురస్కారాన్ని ఇస్తు న్నారన్నప్పుడు తనకు ఎంతో ఆనందం కలిగిం దన్నారు. ఈ సభలో సాహితీ విమర్శకులు పి. సంజీవమ్మ ఆత్మీయ అతిథిగా పాల్గొని ప్రసం గించారు. నిర్వాహకులు అలపర్తి పిచ్చయ్య చౌదరి, దుర్గా కుమారి మాట్లాడుతూ కవిత విద్యా సాం స్కతిక సేవా సంస్థ తరపున చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన పెద్దిరెడ్డి నీలవేణి, జి. ఎల్లేశ్వరరావు, ఎస్‌. ఎమ్‌. డి బాషా, ముడియం కిషోర్‌, భూపతి రాయల్‌ను సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సాహితీ అభిమానులు, ఆర్తి హోం విద్యార్థినులు పాల్గొన్నారు.