Sep 12,2023 00:03

ప్రజాశక్తి - వేటపాలెం
మండలంలో ప్రసిద్ధి చెందిన శ్రీ కనక నాగవరపు అమ్మవారి దేవస్థానం ముఖద్వారానికి స్టీల్ అక్షరాలు ఏర్పాటు చేసినట్లు దేవస్థానం మాజీ చైర్మన్ అచింశెట్టి భానుమూర్తి సోమవారం తెలిపారు. రామన్నపేట గ్రామ సేనాది పతుల ఆధ్వర్యంలో ఘనంగా పూజా క్రతువులు నిర్వహించారు. రామనగర్ గ్రామస్తులు బొడ్డు వీరాంజీనేయులు ధర్మపత్ని వెంకట శేషమాంబ రూ.25116, బొంబాయికి చెందిన అచ్యుతుని లక్ష్మి నరసింహ రావు ధర్మపత్నిపద్మజా రూ.10,116 విరాళంతో అక్షరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సభ్యులు బండ్ల బాబు, గ్రామ సేనాధిపతులు దేవన వెంకటేశ్వర్లు, బులసల రామలింగం, ఉమ్మిటి మాధవరావు, దేవన వెంకటసుబ్బారావు, ఓలుకుల పరమేశ్వరావు, పృద్వి చెంచు సుబ్బారావు, ఉమ్మిటి యజ్ఞ నారాయణ, బండ్ల సురేంద్ర, దంతం శ్రీను, కుందాం నాగరాజు, రమాకాంతరావు, భాస్కరరావు, లవకుమార్, శివాజీ, పూజారి సాధు శ్రీనివాసరావు పాల్గొన్నారు.