ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు మండలం నాగులపాలెం గ్రామ సచివాలయ పరిధిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ప్రతి గడపకూ తిరిగి జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని వైసిపి పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త ఆమంచి కష్ణమోహన్ అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ కాలనీ మంచినీటి చెరువును పరిశీలించారు. అనంతరం చర్చిలో ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని రోడ్లు, డ్రైనేజీ తదితర ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కరాకుల రూతుమ్మ, ఎంపీటీసీ మొరుగోలు సరోజినమ్మ, పర్చూరు వైసిపి మండల కన్వీనర్ కటార అప్పారావు, కూరాకుల బిల్లా, పర్చూరు వైస్ ఎంపీపీ పాలేరు వీరయ్య, మాజీ ఎంపీపీ కోట హరిబాబు, మేడికొండ అశోక్, మద్దిరాల ఆసి, బొత్తు ఎకోస్వా, మెరుగోలు బెంజిమెన్, శ్రీకాంత్, శేషగిరి, రామకృష్ణ, మాణిక్యరావు, బుక్య, బ్రహ్మ, రాజేష్, పులిపాటి డేవిడ్, గేరా భాస్కర్రావు, మరియు పర్చూర్ మాజీ వైస్ సర్పంచ్ గాదె సురేష్, ఆకుల హేమంత్, గౌతమ్, ఉప్పలపాటి అనిల్, అడపా సుధాకర్ రెడ్డి, దగ్గుబాటి రామకష్ణ, నాగమణి, కోలా శ్రీహరి, ముప్పాళ్ల రాఘవయ్య, గోరెంట్ల నాగేశ్వరావు, మున్నం నాగేశ్వరావు, మరియు పర్చూర్ వైఎస్‌ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. పర్చూరు మండల అధికారులు పర్చూరు ఎంపీడీఓ ప్రద్యుమ్న కుమార్, నాగులపాలెం పంచాయతీ సెక్రెటరీ పఠాన్ మహబూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.










