Nov 17,2023 19:50

పూజలు చేస్తున్న మహిళలు

ప్రజాశక్తి -నెల్లూరు :నెల్లూరు నగరంలోని శెట్టిగుంటరోడ్డు వద్దనున్న నాగేంద్ర నగర్‌ పుట్టవీధి వద్ద శుక్రవారం నాగులచవితి వేడుకలు జరిగాయి. అక్కడికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.శనివారం మధ్యాహ్నం నాగేంద్ర నగర్‌ పుట్ట వద్ద అన్నదానం చేయనున్నట్లు నిర్వహకులు కుక్కుపల్లి శ్రీనివాసులు, సి.హెచ్‌ వెంకట రమణ, కె.సుబ్బారావు, పి.హరి, కె.వెంకటేశ్వర్లు, నాగేంద్ర తెలిపారు.