May 16,2023 17:51

తిమ్మాపురం గ్రామ పెద్దలకు విరాళం అందజేస్తున్న జడ్‌పిటిసి విరుపాక్షి

ప్రజాశక్తి - చిప్పగిరి
నాగరికతకు, సాంప్రదాయాలకు విలువనిస్తూ పురాతన కాలం నుంచి కూడా పెద్దలు దేవాలయ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నిర్మించారని ఉమ్మడి జిల్లాల పంచాయతీరాజ్‌ వింగ్‌ అధ్యక్షులు, జడ్‌పిటిసి విరుపాక్షి పేర్కొన్నారు. మంగళవారం నగరడోనా పంచాయతీలోని మజరా గ్రామమైన తిమ్మాపురంలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ దేవాలయ నిర్మాణానికి సర్పంచి నాగేంద్ర, తిమ్మాపురం గ్రామ పెద్దలు జడ్‌పిటిసి విరుపాక్షిని కలిసి సహాయ, సహకారాలు అందించాలని కోరారు. వారి విజ్ఞప్తి మేరకు స్పందిస్తూ వెంటనే రూ.30 వేలు అందజేశారు. మున్ముందు కూడా తన సహాయ, సహకారాలు అందిస్తానని హామీఇచ్చారు. గ్రామ పెద్దలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.