Jul 09,2023 01:29
రాజారావుకు నివాళులర్పిస్తున్న సిపిఎం నాయకులు జాలా అంజయ్య

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: సిపిఎం ఇంకొల్లు మండల కార్యదర్శి నాగండ్ల వెంకట్రావు తండ్రి నాగండ్ల రాజారావు(65) మృతి చెందారు. రాజారావు కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి సహకారం అందిస్తోందని సిపిఎం రాష్ట్ర నాయకులు జాలా అంజయ్య పేర్కొన్నారు. సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య వెంకట్రావు కుటుంబాన్ని పరామర్శించారు. ఆదివారం రాజారావు అంత్యక్రియలు ఇంకొల్లు మండలం హనుమోజీపాలెంలో నిర్వహించారు. నివాళులర్పించిన వారిలో కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామ్‌, బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య, చీరాల డివిజన్‌ కార్యదర్శి ఎన్‌ బాబూరావు, రైతుసంఘం నాయకులు కందిమళ్ల రామకోటేశ్వరరావు, సిఐటియు డివిజన్‌ కార్యదర్శి జి ప్రతాప్‌, జి మహేష్‌, శంకరయ్య, శంకర్రావు, శ్రీనివాసరెడ్డి, గోవిందరాజులు, యెషయా, గంగయ్య, భానుప్రసాద్‌, వి సత్యానందం తదితరులు పాల్గొన్నారు.