Mar 29,2023 01:11
డాక్టర్‌ పట్టా పొందిన నాగబోయిన మణిదీప్‌ (మధ్యలో) చిత్రంలో నాగబోయిన రంగారావు

ప్రజాశక్తి-పంగులూరు: సిపిఎం రాష్ట్ర నాయకులు, పంగులూరు గ్రామవాసి నాగబోయిన రంగారావు మనవడు నాగబోయిన మణిదీప్‌ డాక్టర్‌ పట్టా పొందాడు. గుంటూరు మెడికల్‌ కాలేజీలో నాలుగు సంవత్సరాలు ఎంబిబిఎస్‌ చదివి, హౌస్‌ సర్జన్‌ కూడా పూర్తి చేసి, ఈ నెల 26వ తేదీన కళాశాలలో జరిగిన స్నాతకోత్స వంలో డాక్టర్‌ పట్టా పొందాడు. మణిదీప్‌ సిపిఎం రాష్ట్ర నాయకులు నాగబోయిన రంగారావు మనవడు. మణిదీప్‌ పదవ తరగతిని ఒంగోలు గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌లో చదివి, ఇంటర్మీడియట్‌ మంగళగిరిలోని గురుస్‌ అకాడమీలో చదివి 987 మార్కులు సాధించాడు. అనంతరం నీట్‌లో స్టేట్‌ ర్యాంక్‌ 381 సాధించి, గుంటూరు మెడికల్‌ కాలేజీలో సీటు సంపాదించాడు. హౌస్‌ సర్జన్‌ కూడా పూర్తి చేసిన మణిదీప్‌, పీజీ కోర్సును అమెరికాలో చేసేందుకు సిద్ధమవు తున్నాడు. తాత నాగబోయిన రంగారావు వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మణిదీప్‌, పీజీ కోర్స్‌ అనంతరం ఇండియాకు వచ్చి తన తాత లాగే సామాజిక సేవలో ఉండాలని భావిస్తున్నాడు. నాగబోయిన రంగారావు సిపిఎం నాయకులుగా, పంగులూరు మండల పరిషత్‌ అధ్యక్షులుగా పనిచేసి, రైతు సంఘం నాయకుడిగా అనేక సమస్యలపై ఉద్యమాలు నడిపారు. రైతులు, పేదల కోసం పనిచేసిన ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లావాసులకు సుపరిచితులే. రంగారావు రెండో మనవడు నాగబోయిన రోహిత్‌ కూడా ప్రస్తుతం కర్నూలు మెడికల్‌ కాలేజీలో సీటు సాధించి చదువుతున్నాడు.