విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండ ను ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. స్థానిక లాంచీ స్టేషన్ నుంచి నాగార్జున కొండ కు నాగసిరి, శాంతి సిరి లాంచీ లలో కొండకు వెళ్లిన పర్యాటకులు అక్కడ మ్యూజియంలో ఉన్న బుద్దిని ప్రతిమలు, రాతి పనిముట్లు, మట్టి కుండలు, 9 అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, మహాస్తూపం, అశ్వమేధ శాల, స్నానాలగటును సందర్శించారు. అనంతరం అనుపు లోని యాంపి స్టేడ ియం, అశ్వమేద యగశాల, శ్రీ రంగ నాథస్వామి దేవా లయం, తదనంతరం 60 అడుగుల ఎత్తునుండి జాలువారే ఎత్తిపోతల జలపాతాన్ని తిలకించారు.ఆదివారం లాంచీల ద్వారా పర్యాటక శాఖ కు ఆదాయం సమకూరినట్లు అది óకారులు తెలిపారు.










