Jun 05,2023 17:50

నాగ పుల్లయ్య మృతదేహానికి నివాళ్లు అర్పిస్తున్న దృశ్యం

నాగ పుల్లయ్య మృతి తీరని లోటు : టిడిపి

ప్రజాశక్తి - బేతంచెర్ల

ఆర్‌ఎస్‌ రంగాపురం టిడిపి నాయకుడు నాగ పుల్లయ్య మృతి పార్టీకి తీరని లోటు అని డోన్‌ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి, బేతంచర్ల మండలం కన్వీనర్‌ ఉన్నాం ఎల్ల నాగయ్య అన్నారు. నాగ పుల్లయ్య అనారోగ్యంతో సోమవారం మరణించాడు. విషయం తెలుసుకునక్న ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి ఆర్‌ఎసన్‌ రంగాపురంకు వచ్చి నాగ పుల్లయ్య భౌతికకాయానికి పూలమాలలు వేసి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నాయకులు రాధాకృష్ణ, లొడ్డ రామ్‌ మద్దయ్య, శేఖర్‌, గుడిసె మద్దిలేటి, నల్లాడి నివాళ్లు అర్పించారు.