ప్రజాశక్తి-ఆదోనిరూరల్
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు-నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో వెలుగులు నిండాయి. పాఠశాలల రూపురేఖలు మారాయి. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ అభివృద్ధి చేస్తున్నారు. అలా అభివృద్ధి చెందిన పాఠశాలనే ఆదోని మండలంలో ఢణాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. గతంలో అక్కడ కొంతమంది విద్యార్థులతో మాత్రమే అరకొర వసతుల్లోనే విద్యాబోధన చేపట్టేవారు. ఉపాధ్యాయులు మంచిగా బోధన చేసినా విద్యార్థులకు సరైన మౌలిక వసతులు లేకపోవడంతో ఆ పాఠశాలకు వెళ్లలేక చదువులను మధ్యలో ఆపేసేవారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి. గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలలు నూతన ఒరవడిని సంతరించుకున్నాయి. రెండో విడత నాడు-నేడు పనుల్లో భాగంగా రూ.56 లక్షలతో పాఠశాల చుట్టూ ప్రహరీ, నాలుగు అదనపు తరగతి గదులు, కిచెన్ రూమ్, పాఠశాలల భవనాలకు మరమ్మతులు చేయించడమే కాకుండా, ఆధునికత ఉట్టిపడేలా, విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా చాలా అందంగా తీర్చిదిద్దారు. విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షించడానికి కార్పొరేట్ పాఠశాలలు ఏ విధంగా పాఠశాలలను సిద్ధం చేస్తున్నాయో ప్రభుత్వ పాఠశాలలను సైతం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయిస్తున్నారు.
నాడు-నేడుతో పాఠశాలలో మౌలిక వసతులు
- ఎంవిబిఎస్.అనిల్ కుమార్, ప్రధానోపాధ్యాయులు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు ద్వారా పాఠశాలలో మాలిక వసతులు కల్పిస్తున్నాం. మొత్తం పాఠశాలలో 300 మందికి పైగా విద్యనభ్యసిస్తున్నారు. 10వ తరగతి విద్యార్థుల విషయానికొస్తే జె.దివ్య 536, కె.వెన్నెల 523 మార్కులు సాధించారు.
నాడు-నేడు ద్వారా అదనపు గదుల నిర్మాణం










