నాడు- నేడు పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే నాగిరెడ్డి
ప్రజాశక్తి -గాజువాక : నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. 76వ వార్డు పరిధి రామచంద్రనగర్ ప్రభుత్వ పాఠశాలలో రూ.15 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. గాజువాక నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విద్య, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్‌నారాయణ, దొడ్డి రమణ, కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, చిక్కా సత్యనారాయణ పాల్గొన్నారు.










