ప్రజాశక్తి-గొలుగొండ:సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్ అన్నారు. బుధవారం గొలుగొండ మండలం చీడిగుమ్మల గ్రామంలో కోటి 30 లక్షలతో పూర్తయిన పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చీడిగుమ్మ జిల్లా పరషత్ హైస్కూల్‌లో ఇటీవల నాడు నేడు పథకం ద్వారా రూ.70లక్షలతో పనులు పూర్తి చేయడంతో 300 మంది విద్యార్ధులకు మంచి విద్య అందుతుందన్నారు. ప్రాధమిక పాఠశాలల్లో మరో 20లక్షలకు పైగా నిధులతో అదనపు భవనాలు, ప్రహారీ పనులు పూర్తి చేశామన్నారు. ప్రధానంగా గ్రామ సచివాలయం పనుల కోసం 40లక్షలకు పైగా నిధులు మంజూరు కావడంతో పనులు పూర్తి చేయడం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికెల భాస్కర్‌నాయుడు, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపిపి గజ్జలపు మణికుమారి, పంచాయతీరాజ్‌శాఖ డీఈఈ ప్రసాద్, హైస్కూల్ హెచ్‌ఎం గండేపల్లి నాగేంద్ర, స్కూల్ కమిటీ చైర్మన్ నాయుడు, సర్పంచ్ కె.చిన్నబ్బాయి, ఎంపిటిసి లెక్కల అప్పలనాయుడు, తహశీల్దార్ ఆనందరావు, ఎంపిడిఒ డేవిడ్‌రాజు పాల్గొన్నారు.










