Aug 10,2022 23:35

శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి

ప్రజాశక్తి- గాజువాక : నాడు- నేడుతో పాఠశాలలు అభివృద్ధి చెందాయని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. రూ.77 లక్షల వ్యయంతో కణితి హైస్కూల్లో 6 తరగతి గదులకు బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు సరిపడా గదులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. గాజువాక నియోజకవర్గ పరిధిలోని అన్ని పాఠశాలలకు నాడు-నేడు పథకం ద్వారా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కోమటి శ్రీనివాసరావు, బి.గోవిందు, ఎం.దామోదర్‌, దానప్పలు, చిత్రాడ వెంకటరమణ, రమాదేవి పాల్గొన్నారు.