Jul 08,2023 19:29

పనులను పరిశీలిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
ఆదోనిలోని మున్సిపల్‌, నెహ్రూ మెమోరియల్‌ ఉన్నత పాఠశాల్లో నాడు-నేడు పనులను త్వరగా పూర్తి చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, ఉపాధ్యక్షులు శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. శనివారం నాడు-నేడు పనులను ఎస్‌ఎఫ్‌ఐ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాడు-నేడు పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. పెండింగ్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షులు భరత్‌ కుమార్‌, నాయకులు నాగరాజు, గణేష్‌, శశిధర్‌, తరుణ్‌, పవన్‌, రాజు పాల్గొన్నారు.