May 03,2023 23:41

అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న డిఇఒ రామారావు

ప్రజాశక్తి-చెరుకుపల్లి : నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు మెరుగుపడినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు. మండల పరిధిలోని గుల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో నాడు- నేడు పేజ్‌ -2 ద్వారా రూ.42 లక్షల నిధులతో నిర్మిస్తున్న పాఠశాల భవనాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు సలహాలు చేశారు. పనులు త్వరిత గతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ నవీన్‌ కుమార్‌, ఎఇ రాజేష్‌, దివాకర్‌ పాల్గొన్నారు.