Nov 01,2022 23:37

నాడు నేడు పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే ధనలక్ష్మి.

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నాడు నేడు నిధులు రూ47.19 లక్షలతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మంగళవారం శంకుస్థాపన చేశారు. కళాశాలలో బాలురు, బాలికలకు విడివిడిగా మరుగుదొడ్ల బ్లాకులకు మరమ్మతులు, తదితర పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ మదీనా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవంలో భాగంగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యాభివృద్ధికి సిఎం జగన్‌ వినూత్న పథకాలను అమలు చేస్తున్నారని, నాడునేడు నిధులతో పారశాలల అభివృద్ధి, మౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని, ప్రతి ఒక్కరూ బాగా చదివి భవిష్యత్‌ను బంగారుమయం చేసుకోవాలని ఆకాంక్షించారు.
అంతకుముందు చెరుకుంపాలెం, జడ్డంగి, దూసరపాము గ్రామాలలో జెడ్‌పిటిసి నిధులతో మంజూరైన సిసి రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ధనలక్ష్మి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపిపిగోము వెంకటలక్ష్మి, జెడ్‌పిటిసి ఒడుగుల జ్యోతి, సొసైటీ అధ్యక్షులు శింగిరెడ్డి రామకష్ణ, ఎంపిడిఒ కె బాపన్న దొర, తహసీల్దార్‌ వైవి సుబ్రహ్మణ్యచారి, జిసిసి మేనేజర్‌ విజయలక్ష్మి, ఎంఇఒ కె తాతబ్బాయి దొర, వైస్‌ ఎంపిపిలు సిహెచ్‌ సత్యచంద్రరాణి, రాజేశ్వరి, ఎంపిటిసిలు కె గంగాదుర్గ, రామలక్ష్మి, సర్పంచ్‌లు కుంజం జగన్నాధం, ఎ శుభలక్ష్మి, కోఆప్క్షన్‌ సభ్యులు ఎ.కామేష్‌, వైసిపి నేతలు ఎన్‌ కుశరాజు, దాట్ల వెంకటేశ్వరరాజు పాల్గొన్నారు.