ప్రజాశక్తి-విఆర్ పురం : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 'నాడు నేడు' కింద మంజూరైన రూ.16లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు స్థానిక ఎంపిపి కారం లక్ష్మి, జెడ్పిటిసి వల్ల రంగారెడ్డి, ఎఎస్‌డిఎస్ డైరెక్టర్ గాంధీబాబు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ, జూనియర్ కాలేజీలో నాడునేడు నిధులతో మరుగుదొడ్లు అభివృద్ధి, తాగునీరు, ఇతర సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. నాణ్యతతో పనులు చేపట్టి, నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఎంపిపి కోరారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఆర్ ఫణీంద్ర శ్రీరామ్, గిరి సర్పంచ్ పులి సంతోష్‌కుమార్, ఎంపిటిసి ముత్యాల భవాని, సర్పంచ్ సొడే నర్సమ్మ , ఉప సర్పంచ్ శ్రీను, సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్న బాబు, సత్యనారాయణ, హజరత్, మాజీ జెడ్పిటిసి ముత్యాల రామారావు, రహీం, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ వైసిపి కార్యదర్శి బొడ్డు సత్యనారాయణ, ఎఇ ఎం.సాయిరాం, కళాశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు










