దేవరపల్లి పాఠశాలలో నాడు-నేడు పనులకు శంకుస్థాపన చేస్తున్న ప్రజాప్రతినిధులు
ప్రజాశక్తి-మారేడుమిల్లి : మండలంలోని సున్నపాడు పంచాయితీ పరిధి దేవరపల్లి, వేటుకూరు పంచాయితీ పరిధి ఇవ్వంపల్లి గ్రామాలలోని పాఠశాలల్లో నాడు-నేడు పథకం కింద చేపట్టనున్న పనులకు ఎంపీపీ సార్ల లలిత కుమారి, జెడ్పీటీసీ సభ్యుడు గొర్లె బాలాజీ బాబు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టి, త్వరగతిని పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్కోండ రవి కుమార్, ఎంపీడీవో వీర కిషోర్, మండల కో-ఆప్షన్ సభ్యుడు గురుకు దర్మరాజు, సున్నంపాడు ఎంపిటిసి సభ్యుడు అనిల్ కుమార్, వేటుకూరు, సున్నంపాడు సర్పంచ్‌లు లచ్చిరెడ్డి, మల్లీశ్వరి, వైసిపి మండల కన్వీనర్ సత్తి సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి బోడ్జెటీ గంగరాజు తదితరులు పాల్గొన్నారు.










