ప్రజాశక్తి-అడ్డతీగల : మండల కేంద్రంలోని పాఠశాలల్లో నాడు- నేడు కింద చేపట్టనున్న పనులకు స్థానిక ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో రూ.69 లక్షలతోనూ, సీతారామరాజు కాలనీలో ఉన్న జిపిఎస్ పాఠశాలలో రూ.16 లక్షలతోనూ, అనంత చక్రరరావు జూనియర్ కాలేజీ రూ.56 లక్షలతోనూ, ఎస్టీ బాలుర వసతి గృహంలో కోటి 9 లక్షల రూపాయలతో ఈ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. దీనికి ముందు ఎంపీడీవో కార్యాలయంలో అడ్డతీగల, రాజవొమ్మంగి, గంగవరం, వై.రామవరం మండలాలకు సంబంధించి వైఎస్‌ఆర్ చేయూత కార్యక్రమం నిర్వహించారు. 7600 మంది వైఎస్‌ఆర్ చేయూత లబ్ధిదారులకు రూ.14.25 కోట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఎపిడి అల్లాడి శ్రీనివాసరావు, నాలుగు మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఏపిఎంలు, వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.










