ప్రజాశక్తి - ఉంగుటూరు
నారాయణపురం మహాత్మాగాంధీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నాడు-నేడు పథకంతో వచ్చిన నిధులతో మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని డివిఇఒ ఆర్.ప్రభాకరరావు తెలిపారు. సోమవారం ఆకాలేజిలో నాడు-నేడు పనులను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. ఫస్ట్ ఇయిర్‌లో 82 మంది విద్యార్థులు చేరడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మూడో యూనిట్ పరీక్షలతో విద్యార్థులు సంసిద్ధం అవ్వాలని అందుకు తగిన సూచనలిచ్చారు. ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు విశేషంగా కృషి చేస్తోందన్నారు. సంబంధిత నిర్మాణ పనులపై అధ్యాపకులతో సమీక్ష నిర్వహించారు. ఇంఛార్జి ప్రిన్సిపల్ బివి శ్రీనివాస్ పాల్గొన్నారు.










