Jul 24,2023 22:12

ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి

సీతంపేట: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బొమ్మిక ఆశ్రమ పాఠశాలలో నాడు-నేడు నిధులు దుర్వినియోగమయ్యాయని, దీనిపై విచారణ జరిపించాలని గిరిజన ఐక్యవేదిక సంఘం జిల్లా అధ్యక్షులు దివ్వెల లక్ష్మీనారాయణ సోమవారం స్పందనలో పిఒ కల్పనా కుమారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ పాఠశాలకు మంజూరైన నిధులు ఖర్చు చేయలేదని, ప్రధానోపాధ్యాయులు తన సొంత ఖర్చులకు వాడుకున్నాడని ఆరోపించారు. నడిమి గోడకు చెందిన అశ్విని చెక్‌ డ్యామ్‌ మంజూరు చేయాలని కోరారు. పెద్దూరు సర్పంచ్‌ ఆదిలక్ష్మి చెక్‌ డ్యామ్‌ మంజూరు చేయాలని కోరారు. కోడి పిల్లగూడ చెందిన సుస్మిత అంగనవాడీలో హెల్పర్‌ పోస్ట్‌ ఇప్పించాలని కోరారు. కొత్త బాలేరుకు చెందిన సవర చిన్నారి ఆశ కార్యకర్త పోస్ట్‌ ఇప్పించాలని విన్నవించారు. సోమగండికి చెందిన స్వర్ణకుమారి హౌసింగ్‌ బిల్లు మంజూరు చేయాలని వినతి సమర్పించారు. జి.గుమ్మడ చెందిన సూర్యారావు ఉపాధి హామీ పని దినాలు పెంచాలని కోరారు. మొగధార గూడకు చెందిన బంగారు సిసి రోడ్డు మంజూరు చేయాలన్నారు. పెద్దూరుకు చెందిన రాజేష్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు మంజూరు చేయాలని కోరారు. జాతపు జగత్‌పల్లి చెందిన మోజేష్‌ తాగునీరు పైపు మంజూరు చేయాలని కోరారు. ధారపాడు చెందిన రమేష్‌ బస్‌ షెల్టర్‌ మంజూరు చేయాలని విన్నవించారు. ఈ స్పందన కు 151 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో డిడి శ్రీనివాసరావు, ఎపిఒ రోషి రెడ్డి, డిప్యూటీ డిఇఒ ఢిల్లీరాణి, సిడిపిఒ పి.రంగలక్ష్మి, ఎడిఇ తిరుమలరెడ్డి, డిఇ కృష్ణకుమార్‌, ఎంఒ కోటిబాబు తదితరులు పాల్గొన్నారు.