
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి గతం ఎంతో ఘనం ప్రస్తుతం దయనీయం అనే మాటకు నగరలోని గోదావరి రైల్వే స్టేషన్ దర్పణం పడుతోంది. గతంలో నిత్యం ప్రయాణికుల రాకపోకలతో ఈ రైల్వే స్టేషన్ సందడిగా ఉండేది. ప్రస్తుతం రైళ్ల హాల్ట్‌లు తగ్గిపోవటతో ఆ నాటి పరిస్థితులు కనుమరుగయ్యాయి. జిల్లా కేంద్రమైన రాజమహేం ద్రవరం నగరం నుంచి విశాఖపట్నం, విజయవాడ వైపు రైళ్లలో ఎకువమంది రాకపోకలు సాగిస్తుంటారు. నగర నడిబొడ్డున ఉన్న గోదావరి స్టేషన్ నుంచే అధిక శాతం ప్రయాణికులు ఇక్కడి నుంచే రైళ్లు ఎక్కేవారు. ఇప్పుడా పరిస్థితి కన్పించడం లేదు. ముఖ్యమైన రైళ్లలో కొన్నింటికి ఇక్కడ హాల్ట్ లేకపోవడం, మరికొన్ని సమయా నుకూలంగా లేకపోవడంతో ప్రయాణీకులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. లేదా వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రధాన స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తోంది. గతంలో ఈ స్టేషన్ నుంచి 7 నుంచి 8 వేల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించేవారని అంచనా. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 1500లకు మించడం లేదు. పుష్కరాలు, ప్రతి ఏటా జరిగే మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో గోదావరి ఘాట్లలో స్నానాలు చేసేదుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే యాత్రికులతో ఈ స్టేషన్ కళకళలాడేది. ప్రధాన రైల్వేస్టేషన్ తర్వాత రాజమహేంద్రవరం నగరం మధ్యలో ఉన్న గోదావరి స్టేషన్‌కు రద్డీ కూడా ఘననీయంగా ఉండేది. ముఖ్యంగా వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి పాలు, కూరగాయలు నగరానికి తీసుకొచ్చే చిరు వ్యాపారులు, చదువుల నిమిత్తం ఉమ్మడి ఉదయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యా ర్థులు, ఉద్యోగులు ఇక్కడి నుంచే పాసింజర్లు జైళ్లలో రాకపోకలు సాగించేవారు. అలాంటిది నేడు -కళతప్పి వెలవెలబోతోంది.
రైళ్ల హాల్ట్‌లు క్రమ క్రమంగా కుదింపు
ప్రస్తుతం ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు కేవలం 11 మాత్రమే ఆగుతున్నాయి. గతంలో సుమారు 15 వరకూ ఆగేవి. కాకినాడ, రాజమహేం ద్రవరం వైపు నుంచి ఈ స్టేషన్ మీదుగా విజయవాడ వైపు నడిచేవి రోజూ మూడు రైళ్లకు మాత్రమే ఈ స్టేషన్‌లో హాల్ట్ ఉంది. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ జంక్షన్ వెళ్లే విజయవాడ మెము ప్రత్యేక రైలు అర్థరాత్రి వాటిన తర్వాత 1.27 గంటలకు ఇక్కడికి వస్తుంది. కాకినాడ పోర్టు నుంచి విజయవాడ జంక్షన్ వెళ్లే మెము ఎక్స్ ప్రెస్ తెల్లవారుజాము 5.44, రాజమహేం ద్రవరంస్టేషన్ నుంచి విజయవాడ జంక్షన్‌కు వెళ్లే విజయవాడ మెము ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 6.30 గంటలకు వస్తుంది. ఈ మధ్యలో గోదావరి స్టేషన్ నుంచి విజయవాడ వైపు వెళ్లే ఏ రైలు ప్రయాణీకులకు అందుబాటులో లేదు. విజయవాడ వైపు నుంచి వచ్చేవి ఎనిమిది రైళ్ళు మాత్రం ఇక్కడ ఆగుతున్నాయి. మచిలీపట్నం నుంచి. విశాఖపట్నం జంక్షన్ వెళ్లే విశాఖ ఎక్స్ ప్రెస్ అర్ధరాత్రి. 1.21. చెంగల్పట్టు జంక్షన్-కాకినాడ పోర్టు వెళ్లే సర్కార్ ఎక్స్‌ప్రెస్ తెల్లవారుజాము 5:18. విజయవాడ ఇంక్షన్- రాజమహేంద్రవరం మెము ప్రత్యేక రైలు. ఉదయం 7.00, అలప్పుజ ధన్బాద్ జంక్షన్ ధన్బాద్ - బొకారో ఎక్స్ ప్రెస్ ఉదయం 7.14. తిరుపతి-కాకినాడ టౌన్ ఎక్స్ ప్రెస్ 8.30, గుంటూరు, జంక్షన్-విశాఖ పట్నం జంక్షన్ సింహాద్రి ఎక్స్‌ప్రెస్ 11.14, విజయవాడ జంక్షన్- కాకినాడ టౌన్ మెము ఎక్‌ప్రెస్ 9.05, విజయవాడ జంక్షన్- రాజమహేంద్రవరం మేము ఎక్స్‌ప్రెస్ 10.05 గంటలకు ఆగుతున్నాయి.
ప్రయాణీకుల భద్రతకూ తప్పని ఇబ్బందులు
ప్రయాణీకుల భద్రతకూ ఇబ్బందులు తప్పటం లేదు. తూర్పువైపు గతంలో ఉన్న బుకింగ్ కౌంటర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. దీంతో ప్రయాణీకులు టికెట్ల కోసం పశ్చిమ వైపు కౌంటర్‌కు వెళ్లక తప్పటం లేదు. అయితే రాత్రీ పగలు తేడా లేకుండా బిచ్చగాళ్లు ప్లాట్ఫామ్‌లపై కాలిబాట వంతెన, సబ్ వేలో తిష్ట వేస్తున్నారు. రైల్వే స్టేషన్ ఆవరణను అపరిశుభ్రం చేస్తున్నారు. ఈ స్టేషన్‌లో పార్కింగ్ చేసిన వాహనాల నుంచి పెట్రోల్ దొంగిలించడం పరిపాటిగా మారింది. ఇటీవల స్టాండు ఏర్పాటు చేయటంతో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. మరో వైపు రాత్రివేళల్లో అసాంఘిక శక్తులకు ఈ స్టేషన్ అడ్డాగా మారింది. రాత్రి వేళల్లో స్టేషన్‌లో దిగి మెయిన్ రోడ్డుకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పోలీసుల గస్తీ పెంచడంతోపాటు ఆ మార్గంలో వెలగని వీధి దీపాలకు మరమ్మతులు చేయాలని ప్రయాణీకులు విజ్ఞప్తి చేస్తున్నారు.