Oct 26,2023 21:58

ప్రజాశక్తి -గంగాధర నెల్లూరు: మా తండ్రి కళత్తూరు నారాయణస్వామిని ఆదరించినట్లే నియోజకవర్గ ప్రజలను తననీ ఆదరించాలని డిప్యూటి సిఎం నారాయణస్వామి కుమార్తె, రాష్ట్ర వైసీపీ మహిళా అధ్యక్షురాలు కృపాలక్ష్మి కోరారు. మండలంలోని వేపంజేరి హైస్కూల్‌లో గురువారం కృపాలక్ష్మీ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం జగనన్న ఆరోగ్య సురక్ష ప్రవేశపెట్టారని అన్నారు. ఐసిడిఎస్‌ సిబ్బంది ఏర్పాటు చేసిన పోషకాహార స్టాళ్లను పరిశీలించి, పోషకాహార విలువలపై అవగాహన కలిగిన ఐసిడిఎస్‌ సిబ్బందిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. కంటి పరీక్షలు చేసుకొన్నవారికి కంటి అద్దాలను ఉచితంగా పంపిణీ చేశారు. మండల వైస్‌ ఎంపీపీ హరిబాబు, వైసీపీ మాజీ మండల కన్వీనర్‌ సురేంద్రరెడ్డి, ఎంపీడీవో శ్రీదేవి, తహశీల్దార్‌ ఇన్బనాధన్‌, డాక్టర్లు షర్మిల, ప్రశాంత్‌ పాల్గొన్నారు.