
బి కొత్తకోట : మండలంలోని బయ్యప్పగారిపల్లి పంచాయతీలో నా మట్టి - నా దేశం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టంగా చేపట్టిన నామట్టి నాదేశం కార్యక్రమాన్ని బయ్యప్పగారిపల్లి సర్పంచ్ రామ్మోహన్ ఆధ్వర్యంలో మట్టి నమూనాలు సేకరించి కలశ పూజలు చేశారు. స్వతంత్ర సమరయోధులు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ మట్టిని మండల ప్రజా పరిషత్ కార్యాల యానికి పంపించడం జరిగిందని అక్కడ నుంచి ఢిల్లీ రాజధానికి పంపిం చడం జరుగు తుందని సర్పంచ్ తెలి పారు. ఈ బహత్కర కార్యక్రమంలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు. పెద్దతిప్పసముద్రం మండలం మడుమూరు పంచా యతీలో సర్పంచ్ నాగరత్న, భాస్కర ్‌నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్ర మంలో పంచాయతీ సెక్రెటరీ, అగ్రికల్చర్ ఆఫీసర్ పాల్గొన్నారు. పాల్గొన్నారు. కలకడ : అమత కలశయాత్ర ఎంపిపి శ్రీదేవిరవికుమార్ ఆధ్వర్యంలో మండ లంలో ఘనంగా నిర్వహించారు.అమతకలస్ యాత్రలో భాగంగా మేర నామట్టి నాదేశం కార్యక్రమంలో భాగంగా పంచాయతీలో పలు గ్రామాల నుంచి మట్టిని, బియ్యాన్ని సేకరించి వాటిని ర్యాలీగా తీసుకువచ్చి ఎంపిడిఒ కార్యాల యంలో చేర్చారు. ఈకార్యక్రమంలో ఎంపిడిఒ పరమేశ్వర్‌రెడ్డి, మండల కన్వీనర్ కమలాకర్‌రెడ్డి, ఎర్రయ్యగారిపల్లి సచివాలయం సెక్రటరీ పవన్ కుమార్, వైసిపి నాయకులు ఆర్ వెంకటరమణ, ఎఎన్‌ఎం అంజలిదేవి, అంగన్వాడీ కార్యకర్తలు, డప్పుకళాకారులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కలికిరి: మేరా మట్టి మేర దేశ్ కార్యక్రమం ఐటిబిపి 53వ బెటా లియన్ ఆధ్వర్యంలో మండలం లోని గుట్టపాలెం పంచాయతీలో ఘనంగా నిర్వహించారు. ఐటిబిపి కమాండెంట్ అమిత్ బాటీ ఆదేశాలు మేరకు కమాండర్ వై.విరెడ్డి ఆధ్వర్యంలో మట్టిని సేకరించి ఢిల్లీలో నిర్మిస్తున్న కర్తవ్య పత్‌కు పంపడానికి కలశ యాత్ర ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటరెడ్డి, కార్యదర్శి గోపి పవిత్ర స్థలం నుంచి తెచ్చిన మట్టిని కలశంలో వేశారు. కార్యక్రమంలో ఎంపిపి, విద్యార్థులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.