ప్రజాశక్తి-పంగులూరు: తన పలుకుబడిని, పరపతిని ఉపయోగించి పక్కనే ఉన్న నా భూమిని ఆక్రమించేందుకు అద్దంకి సింగరాచా ర్యులు ప్రయత్నిస్తున్నా డని, అలవలపాడు గ్రామానికి చెందిన రైతు గరికపాటి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు తక్కెళ్లపాడు రెవెన్యూలోని సర్వే నెంబరు 95/3లో తన తల్లి గరికపాటి తిరుపతమ్మ పేరుతో మూడు ఎకరాల ఒక సెంటు భూమి ఉందని చెప్పారు. ఆ భూమి పక్కనే ఉన్న తూర్పు తక్కెలపాడు గ్రామానికి చెందిన అద్దంకి సింగరాచార్యులు తన భూమిని ఆక్రమించుకునేం దుకు కాలువ తీసి, ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నిస్తున్నాడని, మంగళవారం ప్రజాశక్తికి వివరించాడు. తన భూమి పక్కన ఉన్న సర్వే నెంబరు 96 లోని ఐదు ఎకరాల 88 సెంట్లు భూమి, ప్రస్తుతం కోర్టు వివాదంలో ఉందని, అది పరిష్కారం కాకుండానే తన భూమిని కూడా ఆక్రమించుకునేందుకు సింగరాచార్యుడు ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. సర్వే నెంబర్ 96లోని 5 ఎకరాల 88 సెంట్లు భూమి ,గతంలో కుంటని దీనిలో నుంచి గ్రామ ప్రజ లు నీళ్లు తీసుకెళ్లే వారిని, అందుకే దీనిని నేల కుంట అని పిలిచేవారని అన్నారు. ఈ నేల కుంటను ఆనుకొని ఎత్తయిన కట్ట ఉండేదని, ఆ కట్ట మీదుగా ఈ ప్రాంతానికి వెళ్లే రైతులు వెళుతూ ఉండేవారని శంకర్ తెలిపా రు. అయితే సింగరాచార్యులు ఆ కట్టను తొలగించి నేలకుంటను పూడ్చివేసి, తన సొంత భూమిలా వాడుకుంటున్నాడని, పక్కనే ఉన్న తన భూమిని కూడా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నా డని చెప్పాడు. అయితే తనకున్న పలుకుబడితో పోలీసులను కూడా ఆకట్టుకున్నాడని, పోలీసులు కూడా అతనికే వంత పలుకుతున్నారని ఆరోపించారు. మేము లేకుండానే మా భూములను కొలిచి ఆక్రమించుకునేందుకు సింగరాచార్యుడు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. సింగరాచార్యుడు భూమిని కొలవకుండా హద్దురాళ్లు వేస్తున్నాడని, ఇది సరైనది కాదని ఆయన అన్నారు. ఇప్పటికైనా అధికారులు భూమి మొత్తాన్ని కొలిచి హద్దులు వేయాలని, తమ భూముల ఆక్రమణలను అరికట్టాలని శంకర్ కోరారు.










