- ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్
ప్రజాశక్తి-విఆర్ పురం : మండలంలోని ఒడ్డుగూడెం పంచాయతీలో ఒడ్డుగూడెం కాలనీ ధర్మ తాల గూడెం గొల్లగూడెం గ్రామాలలో చేస్తున్న పునరవాస ఇండ్ల సర్వేను పరిశీలించిన ఎంపీపీ కారం లక్ష్మి సిపిఎం పార్టీ బృందం సర్వే చేస్తున్న అధికారులను సర్వే చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు వారు మాట్లాడుతూ సర్వే చేసే విధానాన్ని తప్పు పట్టారు సర్వే చేసేటప్పుడు ఇంటి పొడవు వెడల్పులు మాత్రమే చూస్తున్నారు కానీ ఆ ఇంట్లో ఉన్న గోడలు సిమెంట్ చేసినవా మట్టితో చేసినవా కూడా కనీసం చూడడం లేదు అంతేకాకుండా ఇంటి చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడలను ఇంటి ఆరుబయట చేసిన సిమెంట్ వాకిలిని కూడా చూడటం లేదనీ విమర్శించారు ఒకవేళ ఇంటి యజమానులు అభ్యంతరం పెట్టిన పట్టించుకునే ఓపిక కూడా సర్వేచేసే అధికారులకు లేదని వాపోయారు సర్వే చేసేటప్పుడు గోడల నాణ్యతను కూడా చూడాలని అసలు వాటి మందం ఎంతలో ఉందో కూడా చూసి నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా సంవత్సరంలో మూడు నాలుగు సార్లు వచ్చిన వరదలకు పూర్తిగా కొట్టుకుపోయిన ఇళ్లకు కూడా సర్వే చేసి నిర్వాసితులకు న్యాయం చేయాలని ఎక్కడ ఏ నిర్వాసితులు కూడా ఇబ్బంది పడకుండా చూడాలని ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఇక్కడే ఉన్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని సర్వే చేయాలని పోలవరం ప్రాజెక్టు వల్ల తాము నష్టపోయినపర్వ లేదు అని రాష్ట్ర భవిష్యత్తు కోసం సంవత్సరాలుగా ఉంటున్న గ్రామలను త్యాగం చేస్తున్న గిరిజన గ్రామాలకు ఎటువంటి అన్యాయం జరగకూడదనిసిపిఎం పార్టీ బృందం డిమాండ్ చేసారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనం. సత్యనారాయణ మండల కార్యదర్శి సోయం చిన్నబాబు నాయకులు పంకు. సత్తిబాబు గుండెపుడి. లక్ష్మణరావు. పోడియం శ్రీరామ్ మూర్తి సోడి. మల్లయ్య తదితరులు పాల్గొన్నారు










