ప్రజాశక్తి-విఆర్ పుర(అల్లూరి) : ప్రజాసేవలో ఎంపీపీ విఆర్ పురం ఎంపీపీ కారం లక్ష్మి, వీఆర్వో, రామవరం గ్రామపంచాయతీ సెక్రెటరీ తాతారావు ముందుకు సాగారు. పది రోజుల నుంచి రామవరం అడివి వెంకన్న గూడెం సోముల గూడెం శబరిరాయిగూడెం కోప్పల్లి ముప్పుకి గురైన గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ వారికి ఏ అవసరం వచ్చినా ముందుండి సహాయం చేస్తున్నారు వారి మధ్యనే ఉంటూ అన్ని విషయాల్లో ముందుండి సహాయం చేస్తూ సాగారు. ప్రజలు మాట్లాడుతూ ఎంపీపీగా గెలిపించుకున్నందుకు మా అదృష్టమని మా పంచాయతీ సెక్రెటరీ తాతారావు వీఆర్వో మా పంచాయతీకి రావటం అదృష్టం అని పోయిన వరదలకు ఇక్కడే ఉండి సహాయం చేశారని ఈ వరదలకు కూడా మమ్మల్ని ఆదుకున్నారని వారితో పాటుగా సిపిఎం యువగళం నాయకులు కారం సుందరయ్య కుకునరు నాగరాజు ,పులి మురళి, కారం సందీప్, బొప్పిన రాజు, కారం మల్లేష్ జగన్ లక్ష్మణ్ వార్డు నెంబర్ సుధీర్ రామవరం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ఆసు లక్ష్మయ్య శబరి రాయిగూడెం గ్రామ శాఖ కార్యదర్శి కుకునరు మురళి రైతు సంఘం విఆర్ పురం మండల కార్యదర్శి వడ్లది రమేష్ మరియు సిపిఎం బృందం రాత్రి వేళలో జ్వరాలు వచ్చిన రాత్రివేళలో ఆసుపత్రులకు వెళ్లాలంటే పడవలు కట్టించి మాతో పాటుగా దగ్గరుండి తీసువెళ్లి వారిని ఎప్పటికప్పుడు మా క్షేమాలు తెలుసుకుంటూ ఉన్నారని వారికి మా గ్రామాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.










