ప్రజాశక్తి-చిన్నగొట్టిగల్లు : చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి బాకరాపేట వద్ద డీసీసీబీ బ్యాంక్ మాజీ ఛైర్మెన్ సహదేవరెడ్డి, ఎంపీపీ యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో యువత భారీ భైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఘణస్వాగతం పలికారు. మోహిత్ రెడ్డి కూడా పార్టీ శ్రేణులను, యువతను ఉత్సాహ పరిచేందుకు బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. మండలంలోని పదమూడు పంచాయిల్లో గడపగడపకు పాదయాత్రలో బాగంగా మొదట దేవరకొండ పంచాయతీ నుండి ప్రారంబించారు. దేవరకొండలో వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు. పంచాయతీ లోని గొల్లపల్లి, వంగిమల్లు వారి పల్లి, కొత్త పల్లి, వెంకటాద్రిపురం, మల్లెలవాండ్ల పల్లి, మైలా వాండ్ల పల్లి, మాదిగ పల్లి, మాదేవాండ్ల పల్లి, గుట్టావాండ్ల పల్లి, బోడిరెడ్డి గారి పల్లి తదితర గ్రామాలలో ఇంటింటికి పర్యటించారు. ప్రతి ఇంటా హారతులు పట్టి మహిళలు ఆహ్వానం పలికారు.సీఎం జగనన్న అందిస్తున్న పథకాలు మీకు అందుతున్నాయా,ఏవైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకొంటూ ముందుకు సాగారు. వృద్దులను ఆప్యాయంగా పలకరిస్తూ.. పెన్షన్ వస్తుందా తాత అవ్వ అని ఆరా తీశారు.. వారి యోగ క్షేమాలను తెలుసుకుంటూ ఆర్థిక సాయం అందజేసుకొంటూ ముందుకు సాగారు. ప్రతి గడపలో ప్రభుత్వ పథకాలు అందుకున్న లబ్ధిదారులకు బుక్ లెట్ ను అందజేసారు.ప్రజలతో మమేకమవుతూ.. వినతులను స్వీకరిస్తూ అప్పటికప్పుడు వినతుల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలిచ్చారు.ఎంపీపీ యుగందర్ రెడ్డి,జట్పీటిసి స్వరూప మహేందర్ రెడ్డి, సర్పంచ్ విజయకుమార్, ఉప సర్పంచ్ ప్రదీప్ బాబు, పార్టీ డివిజనల్ అధ్యక్షులు గురు శంకర్, గ్రామ అధ్యక్షులు సుధాకర్, సచివాలయం కన్వీనర్ గిరిబాబు, మండల యూత్ అధ్యక్షులు చంటి, పార్టీ నాయకులు ప్రసాద్, శివ కుమార్, పార్టీ కార్యకర్తలు, అబిమానులు తదితరులు మోహిత్ రెడ్డి వెంట గడగడప కార్యక్రమంలో పాల్గొన్నారు.










